కాంగ్రెస్‌తో పొత్తుపై కోదండరాం సంచలన ప్రకటన

by Javid Pasha |
కాంగ్రెస్‌తో పొత్తుపై కోదండరాం సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని దక్కించుకునేందుకు టీ కాంగ్రెస్ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల తరహాలో పొత్తులు పెట్టుకునేందుకు సిద్దమవుతోంది. వామపక్షాలతో పొత్తులపై చర్చలు జరగ్గా.. సీట్లు సర్ధుబాటు కూడా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సీపీఎం, సీపీఐకి కలిపి నాలుగు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ముందుకొచ్చినట్లు సమాచారం. రెండో విడత జాబితాతో దీనిపై క్లారిటీ రానుంది. ఇక ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలోని తెలంగాణ జనసమితి పార్టీని కూడా కలుపుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది.

కాంగ్రెస్-టీజేఎస్ పొత్తుకి సంబంధించి శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. కరీంనగర్‌లోని వీపార్క్ హోటల్‌లో రాహుల్‌ గాంధీతో కోదండరాం భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుపై ఇరువురు చర్చించుకున్నారు. కాంగ్రెస్‌తో పొత్తుకు కోదండరాం పచ్చజెండా ఊపగా.. సీట్ల సర్దుబాటుపై కూడా సంప్రదింపులు జరిగినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో టీజేఎస్ విలీనం అవుతుందనే వార్తలు కూడా గతంలో వినిపించాయి. కానీ ఆ వార్తలను కోదండరాం కొట్టిపారేశారు. పొత్తులకు మాత్రం టీజేఎస్ రెడీగా ఉంది.

రాహుల్‌తో భేటీ అనంతరం కోదండరాం కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తామని, బీఆర్ఎస్‌ను గద్దె దించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఎన్నికల వ్యూహంపై రాహుల్‌తో చర్చించానని, సీట్ల ఖరారుపై మాట్లాడేందుకు త్వరలో మరోసారి సమావేశమవుతామని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను ఓడించడమే తమ అందరి లక్ష్యమని పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో కూడా సమావేశం అవుతానని, ఎన్నికల వ్యూహంపై చర్చిస్తామని తెలిపారు.

Advertisement

Next Story