- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే మూసీలో వేసినట్లే.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నాంపల్లి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే మూసీ నదిలో వేసినట్లే అని కీలక వ్యాఖ్యలు చేశారు. తొమ్మిదిన్నరేళ్లు ప్రజలు అధికారం ఇచ్చినా బీఆర్ఎస్ ఏం చేయలేకపోయిందని విమర్శించారు. ఒక్క ఇళ్లు కూడా కట్టలేదని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 4 కోట్ల ఇళ్లు నిర్మించిందని తెలిపారు.
కేంద్రంలో లేని.. ఇక ఎప్పటికీ రాష్ట్రంలో రాని బీఆర్ఎస్‌కు ఓటు వేసి ఏం లాభం లేదని వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేకపోయారని గుర్తుచేశారు. అంతేకాదు.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇంకా క్లారిటీ రాలేదని అన్నారు. ఇచ్చిన గ్యారంటీలను ఎలా అమలు చేయాలో వారికి రూట్‌మ్యాప్ లేదని వెల్లడించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావడానికి ముందు విద్యుత్ కోతలు ఉండేవని.. ఇప్పుడా సమస్య లేదని చెప్పారు.