అమిత్ షా పర్యటన రద్దుకు కారణం ఇదే.. కిషన్ రెడ్డి క్లారిటీ

by GSrikanth |
అమిత్ షా పర్యటన రద్దుకు కారణం ఇదే.. కిషన్ రెడ్డి క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన అనూహ్యంగా రద్దు అయిన విషయం తెలిసిందే. తాజాగా.. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. శనివారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అత్యవసర పనుల వల్ల అమిత్ షా పర్యటన వాయిదా అయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ముందే ఫిక్స్ చేసుకున్న కరీంనగర్, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన సభలు, సమావేశాలు కూడా రద్దు చేస్తున్నట్లు కిషన్ రెడ్డి ప్రకటించారు.

ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికలను లైట్ తీసుకున్న బీజేపీ పార్లమెంట్‌ ఎన్నికలపై సీరియస్‌గా ఫోకస్ చేసింది. ఏకంగా 12 స్థానాలపై దృష్టి సారించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే అమిత్ షాను రంగంలోకి దింపి మూడు సభల్లో పాల్గొనే వ్యూహాలు రచించింది. అయితే కొన్ని అత్యవసర పనుల వల్ల అమిత్‌ షా పర్యటన రద్దు అయ్యింది. దీంతో మరో తేదీలో అమిషా తెలంగాణలో పర్యటించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

Advertisement

Next Story