వాటన్నింటిని మీ ముందు ఉంచాను.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2024-05-03 06:10:25.0  )
వాటన్నింటిని మీ ముందు ఉంచాను.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, అంబర్ పేట: గత ఐదేళ్లలో ఎంపీగా కేంద్ర మంత్రిగా నేనేం అభివృద్ధి కార్యక్రమాలు చేశానో పుస్తక రూపంలో మీ ముందుంచానని సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి జి.కిషన్ రెడ్డి తెలిపారు. దాన్ని గుర్తించి 13న జరిగే ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి మరోసారి నన్ను గెలిపించాలని మీ అశీస్సులకోసం మీ ముందుకు వచ్చానని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబర్ పేట నియోజకవర్గంలోని నల్లకుంట శంకర్ మట్ లోని అపార్డ్‌మెంట్ వాసులను, బస్తీ, కాలనీ సంఘాల ప్రతినిధులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసారు. వారితో కాసేపు ముచ్చటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో బిజెపి మోడీ ఏతర ప్రభుత్వం ఏర్పడితే ఆరు నెలలకు ఒకసారి ప్రధాని మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఆలోచించి ఓటు వేయాలని మోదీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.

ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పాతబస్తీలో 80 శాతం పోలింగ్ నమోదైతే ఇతర ప్రాంతాలలో 40 శాతం మించని పరిస్థితి ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సామూహికంగా మీరందరూ ఓటింగ్‌లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. మీరు ఓటు వేసిన తర్వాత సోషల్ మీడియా వేదికగా మీ మిత్రులతో దాన్ని పంచుకోండని సూచించారు. మీరు ఓటు వేసి సోషల్ మీడియాలో పంచుకోవడం ద్వారా మీ మిత్రులు పరిసరాల్లో ఉన్నటువంటి మీ స్నేహితులు కూడా ఓటు వేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటింగ్ లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

మే 13న దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎన్నికలు దేశం కోసం దేశ భద్రత కోసం సమగ్రత కోసం రక్షణ కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఎన్నికల్లో ఆలోచించి ఓటేయండని కిషన్ రెడ్డి ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, కాలనీ, అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed