కిషన్ రెడ్డి బర్త్ డే.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర సందేశం

by Ramesh N |
కిషన్ రెడ్డి బర్త్ డే.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర సందేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: పుట్టిన రోజు సందర్భంగా స్టేట్ బీజేపీ చీఫ్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఆసక్తికర ప్రకటన విడుదల చేశారు. నిత్యం ప్రజా సేవలో ఉంటూ దేశ, రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి సందేశంలో పేర్కొన్నారు.

కాగా, ఇవాళ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పుట్టిన రోజు కావడంతో ఆయనకు కూడా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను నెటిజన్లతో పంచుకున్నారు. కాగా, నెట్టింట ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ప్రజా భవన్‌లో ఘనంగా నిర్వహించారు.

Advertisement

Next Story