- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kishan Reddy: మేము బీఆర్ఎస్, కాంగ్రెస్ పక్షం కాదు.. ప్రజాపక్షం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వ్యవహార శైలి తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోవాలన్న న్యాయ నిపుణులను సంప్రదించాల్సి ఉంటుందని, ఈ క్రమంలో కొంత జాప్యం జరుగుతుందని దానికి తొందరపాటు వ్యాఖ్యలు చేయడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పడం అవివేకమన్నారు.
న్యూఢిల్లీలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై నిప్పులు చెరిగారు. అవినీతి ఎక్కడ జరిగినా నిష్పక్షపాతంగా విచారణ జరపాలన్నది తమ డిమాండ్ అని, ఫోన్ ట్యాపింగ్ విషయంపై తాము హైకోర్టుకు వెళ్లాం, ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. కాళేశ్వరం మీద సీబీఐ విచారణకు డిమాండ్ చేశాం, దీనిపై సీఎం విచారణ కోరారా..? అలాంటప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ కదా దోస్తీ చేసేది, విచారణ సరిగ్గా జరిగితేనే ఎవరు తప్పు చేశారో ప్రజలకు అర్థమవుతుందని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ వైఫల్యాలను కాంగ్రెస్, కాంగ్రెస్ పాలనపరమైన అసమర్థత నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రులు ఏం చేయాలి? ఏం చేస్తున్నారనే విషయంలో కేటీఆర్, కేసీఆర్ ఇచ్చే సర్టిఫికెట్లు మాకు అవసరం లేదని, బీఆర్ఎస్ పాలనలో ప్రధాన తెలంగాణకు వచ్చి ప్రతిష్టాత్మకమైన, తెలంగాణ అభివృద్ధికి దోహదపడే ప్రాజెక్టులు ప్రారంభించడానికి వస్తే ఫాంహౌజ్ దాటి బయటకు రాని కేసీఆర్, కేటీఆర్‌కు కేంద్ర మంత్రుల గురించి మాట్లాడే కనీస అర్హత లేదని ఎద్దేవా చేశారు.
కలెక్టర్‌పై దాడిని ఖండిస్తున్నాం..
వికారాబాద్ జిల్లా కలెక్టర్ మీద దాడి ఘటనను ఖండిస్తున్నామని, అధికారులపై దాడులు సరికాదని, బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కిషన్‌రెడ్డి విజ్ఝప్తి చేశారు. గ్రామస్తుల మీద అక్రమ కేసులు పెట్టడం సరికాదని, సీఎం సొంత నియోజకవర్గంలో జరిగిన ఘటన అయినందున ప్రజలతో ఆయనే మాట్లాడాలని, ఈ ఘటనను అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనం ఆశించడం సరికాదని సూచించారు. తాము బీఆర్ఎస్, కాంగ్రెస్ పక్షం కాదని.. ప్రజాపక్షం, తెలంగాణ మీడియా పక్షమనే విషయాన్ని చాలాసార్లు చెప్పానని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అనవసరంగా ఒకరిపై ఒకరు బురదజల్లుకునే ప్రయత్నంలో బీజేపీ గురించి అసత్యాలు మాట్లాడితే సహించబోమని ఆయన హెచ్చరించారు. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాబోతుందని ఎలాంటి అనుమానాలకు తావులేదని స్పష్టం చేశారు.