- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kishan Reddy: సీఎం కేసీఆర్‌కు కిషన్ రెడ్డి లేఖ
దిశ, వెబ్‌డెస్క్ : Kishan Reddy Urges CM KCR to allot land for Ramagundam ESI Hospital| సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రామగుండంలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన 5 ఎకరాల భూమిని కేటాయించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రి నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరు చేసినా రాష్ట్రం ప్రభుత్వం ఇప్పటి వరకు స్థలాన్ని కేటాయించకపోవడంతో పనులు ప్రారంభం కాలేదని అన్నారు. కార్మికుల తక్షణ వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రి నిర్మాణానికి ఐదు ఎకరాల భూమిని కేటాయించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో నానాటికి పెరుగుతున్న కార్మికులకు వైద్య సేవలను విస్తృతం చేయడానికి హైదరాబాద్ మహా నగరంతో పాటు ఇతర తెలంగాణ జిల్లాలకు ఈఎస్ఐ వైద్య సేవలను విస్తరించాలని కేంద్ర కార్మిక శాఖ చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా రామగుండం పారిశ్రామిక పరిసర ప్రాంతాల్లో పని చేస్తున్న వేలాది కార్మికులకు అందుబాటులో ఉండేలా 2018లోనే 100 పడకల ఆసుపత్రి నిర్మించాలని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంకల్పించింది. ఆసుపత్రి నిర్మాణానికి భూమి కేటాయించాలని 2018న తెలంగాణ ప్రభుత్వానికి సంబంధిత అధికారులు లేఖ రాసిన తెలంగాణ సర్కార్ స్పందించలేదు. ఈ నేపథ్యంలో భూమి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు తాజాగా మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు.
- Tags
- Kishan Reddy