- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు.. క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కేంద్రం మూడు లక్షల ఇళ్లు మంజూరు చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధాని మోడీ పిలుపులో భాగంగా శనివారం ఢిల్లీలో కిషన్ రెడ్డి మొక్క నాటారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడారు. శుక్రవారం నాటి కేబినెట్ భేటీలో ఇళ్ల మంజూరుపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం రాజకీయ కుట్రలో భాగంగా కేంద్రంపై అనేక విమర్శలు చేసిందని మండిపడ్డారు. ఇళ్లు మంజూరు చేసినా కేసీఆర్ సర్కార్ తీసుకోలేదని అన్నారు. తెలంగాణకు నూతన అధ్యక్షుడి విషయంలో అధిష్టానానిదే తుది నిర్ణయం అన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టిపెట్టినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జమ్ములోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోందని ధీమా వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని అన్నారు. పాక్ ఉగ్రవాదులు శాంతియుత పరిస్థితులు చెడగొట్టాలని చూస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాదు.. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపైనా కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బీఆర్ఎస్ విలీనంపై మా పార్టీలో ఎటువంటి సంప్రదింపులు లేవని వివరణ ఇచ్చారు. మీడియా ఛానళ్లు తమపై అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.