Kishan Reddy: అక్రమ అరెస్టులు ఆపండి.. డీజీపీకి కిషన్ రెడ్డి ఫోన్

by Prasad Jukanti |
Kishan Reddy: అక్రమ అరెస్టులు ఆపండి.. డీజీపీకి కిషన్ రెడ్డి ఫోన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహం ధ్వంసంకు వ్యతిరేకంగా హిందూ సంఘాలు ఇచ్చిన బంద్ సందర్భంగా జరిగిన అరెస్టులపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డీజీపీ జితేందర్ కు ఫోన్ చేశారు. ఈ బంద్ సందర్భంగా బీజేపీ, బీజేపీ యువమోర్చా, ఆర్ఎస్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. ముత్యాలమ్మ విగ్రహాన్ని కొంతమంది అసాంఘిక శక్తులు ధ్వంసం చేసిన సంఘటనలో నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తే అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఈ అరెస్టులను ఆయన ఖండించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డీజీపీని కిషన్ రెడ్డి కోరారు. కాగా ఈ నెల 14న కుమ్మరిగూడలోని ఆలయంలోకి అక్రమంగా చొరబడిన ముంబయికి చెందిన వ్యక్తి (30) అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనకు వ్యతిరేకంగా శనివారం హిందూ సంఘాలు చేపట్టిన బంద్ లో ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలో పోలీసులు లాఠీ చార్జి చేయగా ఆరుగురు గాయపడ్డారు.

Advertisement

Next Story