- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
KCR కంటే CM రేవంత్ రెడ్డి డేంజర్.. కిషన్ రెడ్డి ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి సెటైర్లు వేశారు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో శనివారం మాట్లాడారు. బీజేపీకి తెలంగాణలో ఆదరణ పెరుగుతోందని.. అందుకే కాంగ్రెస్, బీజేపీలు విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ అవినీతికి పాల్పడిందని రేవంత్ రెడ్డి విమర్శస్తున్నారని.. పచ్చకామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నారు. అవినీతికి మారుపేరే కాంగ్రెస్ పార్టీ అన్నారు. గ్యారంటీలు అమలు చేశామని సిగ్గులేకుండా ఫ్లెక్సీలు పెట్టారని సీరియస్ అయ్యారు. ఎన్నికలు దగ్గరపడుతుంటే సీఎంకు అసహనం పెరుగుతోందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రజలకు చెప్పడానికి ఏమీ లేదన్నారు. అబద్ధాలు, తప్పుడు ప్రచారాలతో కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కంటే రేవంత్ అత్యంత ప్రమాదకారి అన్నారు. రేవంత్, కేసీఆర్ అబద్ధాలను అవలీలగా చెబుతారన్నారు. కేసీఆర్, రేవంత్ దొందూదొందే అన్నారు.