- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Kishan Reddy: RRR వేగవంతంతో కాంగ్రెస్ సర్కార్‌కు సంబంధం లేదు.. కిషన్‌రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: రీజినల్ రింగ్ రోడ్డు (Regional Ring Road) పనుల వేగవంతంతో కాంగ్రెస్ సర్కార్ (Congress Government)కు సంబంధం లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండున్నరేళ్ల క్రితం రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 50 శాతం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. మరో 50 శాతం నిధులు సాగరమాల కింద కేటాయించి రీజినల్ రింగ్ రోడ్డు పనులను శరవేగంగా పూర్తి చేస్తామని అన్నారు.
రీజినల్ రింగ్ రోడ్డు (Regional Ring Road) పనుల వేగవంతంతో కాంగ్రెస్ సర్కార్ (Congress Government)కు ఏమాత్రం సంబంధం లేదని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాక ముందే RRRకి కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) కారణంగా RRR పనుల్లో కొంత ఆలస్యం జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పనులు మరింత ఆలస్యం అవుతున్నాయని కామెంట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం (Central Government) RRR టెండర్ల ప్రక్రియను మొదలు పెట్టిందని అక్కడక్కడ ఉన్న భూసేకరణ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వమే పరిష్కరించాల్సి ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.