రుణమాఫీ చేయడం ఆ ఇద్దరికి ఇష్టం లేదేమో.. కోదండరెడ్డి కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
రుణమాఫీ చేయడం ఆ ఇద్దరికి ఇష్టం లేదేమో.. కోదండరెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రైతు రుణమాఫీపై కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు రుణమాఫీ చేయడం బీఆర్ఎస్ ముఖ్య నేతలైన హరీష్ రావు, కేటీఆర్‌కు ఇష్టం లేదేమో అని అభిప్రాయపడ్డారు. వ్యవసాయం, రైతాంగానికి కాంగ్రెస్ ప్రాముఖ్యత ఇస్తోందని అన్నారు. రుణమాఫీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. రూ.2 లక్షలకు పైగా ఉన్న రుణాలను కూడా మాఫీ చేస్తామని అన్నారు. గతంలో కేసీఆర్ రుణమాఫీని ఆలస్యం చేయడం వల్ల ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని గుర్తుచేశారు. రుణమాఫీ కాని రైతులు జిల్లాల్లోని నోడల్ ఆఫీసర్‌కు దరఖాస్తు చేసుకోవాలని అని అన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తెచ్చి నల్ల చట్టాల వల్ల 700 మంది రైతులు చనిపోయారని తెలిపారు. ఇప్పటికీ నల్ల చట్టాలపై ప్రధాని మోడీ సమాధానం చెప్పలేదని అన్నారు. బీజేపీ పాలసీలు ఏనాడూ వ్యవసాయానికి గురించి లేవని వెల్లడించారు. కేవలం బడా పారిశ్రామిక వేత్తల కోసమే బీజేపీ తాపత్రయ పడుతోందని అన్నారు.

Advertisement

Next Story