- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అధ్వానంగా కిన్నెరసాని ఎయిర్ వాల్స్.. మురికి కూపాలుగా ఛాంబర్స్
దిశ, కొత్తగూడెం రూరల్: కిన్నెరసాని నీటి పథకం ద్వారా సరఫరా అవుతున్న తాగు నీరు కలుషితమవుతుంది. లక్ష్మీదేవి పల్లి మండల పరిధిలోని రేగళ్ల గ్రామ పంచాయతీల గల ప్రధాన పైప్ లైన్ కు అక్కడక్కడ మార్చిన ఎయిర్ వాల్స్ లీకులుగా మారి వాల్స్ చుట్టూ ఉన్న చాంబర్స్ మురికి కుంపాలుగా దర్శనమిస్తున్నాయి. కొత్తగూడెం పట్టణంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో తాగునీటి జలాలు కలుషితం కావడమే కాకుండా అవి బురదగా మారి ఇండ్లకు సరఫరా అవుతున్నాయి. వస్తున్న బురద నీటిని చూసి వాటిని తాగేందుకు కుటుంబాలు ముఖం చాటేస్తున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే వరద నీరు ప్రధాన రహదారుల పక్కన ఉన్న కిన్నెరసాని ఎయిర్ వాల్స్ ఛాంబర్ లోకి వెళ్లి నిల్వ ఉంటున్న పరిస్థితి నెలకొంది. ఛాంబర్స్ పై మూతలు లేని కారణంగా అందులో ప్రజలు ఆహార పదార్థాలకు సంబంధించిన వ్యర్ధాలను పడి వేయడం వల్ల చెత్తకుండీలుగా మారి తాగునీటి జలాలు విషపూరితంగా మారుతున్నప్పటికీ మున్సిపాలిటీ అధికారులు సరైన రీతిలో స్పందించకపోవడం విచారకరం.
పట్టణంలోని సెవెన్ హిల్స్ రహదారిలో రెండు కిన్నెరసాని నీటి సరఫరా చాంబర్లు రోత పుట్టే విధంగా ఉండడం కలవరపెడుతుంది. చాంబర్లకు మరమ్మతులు నిర్వహించి స్వచ్ఛమైన నీటిని పట్టణ ప్రజలకు అందించాలని పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేసిన మున్సిపాలిటీ అధికారులు పట్టినట్లుగా వ్యవహరించడంపై ప్రజల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకొని కిన్నెరసాని జలాలు కలుషితం కాకుండా స్వచ్ఛమైన నీటిని అందించేందుకు అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని పలువురు వేడుకుంటున్నారు. డ్రైనేజీని మరిపించే విధంగా ఉన్న కిన్నెరసాని ఎయిర్ వాల్స్ చాంబర్స్ ను శుభ్రం చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.