సింగభూపాలెం అభివృద్ధికి కృషి

by Sridhar Babu |
సింగభూపాలెం అభివృద్ధికి కృషి
X

దిశ బ్యూరో, ఖమ్మం : సింగభూపాలెం అభివృద్ధికి కృషి చేస్తానని ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు. శనివారం సుజాతనగర్ మండలంలోని సింగభూపాలెం చెరువు కరకట్టను పరిశీలించిన ఆయన ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి అక్కడే ఉన్న సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సింగభూపాలెం చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, ఇది కొత్తగూడెం పట్టణానికి చేరువలో ఉందన్నారు. చెరువు శిఖం భూమి 1248 ఎకరాల్లో విస్తరించి ప్రకృతి అందంతో తులతూగుతుందన్నారు. 2500 ఎకరాల ఆయకట్టుతో చెరువు గ్రీనరీగా ఉందని, చెరువు అభివృద్ధికి తన వంతు తోడ్పాటు అందిస్తానని అన్నారు.

సెంట్రల్ టూరిజం మినిస్టర్ తో మాట్లాడి తెలంగాణ ప్రభుత్వ సమన్వయంతో ముందుకు పోతానని చెప్పారు. చెరువు కట్ట వద్ద పనులను పరిశీలించానని, కొన్ని లేయర్లు దెబ్బతిన్నాయని, కరకట్ట పటిష్టతకు తెలంగాణ ప్రభుత్వం పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలలో పర్యటించి తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఆయన వెంట కొత్తగూడెం అసెంబ్లీ కన్వీనర్ టి.నరేంద్రబాబు, పార్లమెంట్ కో కన్వీనర్ బుడగం రవి, జల్లారపు శ్రీను, మండల అధ్యక్షుడు భూక్యా రాజేష్ నాయక్, గుగులోతు రమేష్ బాబు, కొల్లి నరేంద్రబాబు, బొడ్డు బుజ్జి, లక్ష్మీనారాయణరెడ్డి, రాందాస్, మాన్సింగ్, హనుమ, భద్రు, శంకర్ యాదవ్, కూరపాటి రామారావు, సంగు రాజేష్, క్రాంతికుమార్, అనిల్, హేమంత్, మౌనీత్, శ్రీకాంత్, వెంకన్న, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story