మహిళలు అభివృద్ధి సాధించాలి : ఎమ్మెల్యే కందాల

by Sridhar Babu |
మహిళలు అభివృద్ధి సాధించాలి : ఎమ్మెల్యే కందాల
X

దిశ, తిరుమలాయపాలెం : ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక అభివృద్ధి సాధించాలని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. మండలంలో దమ్మాయిగూడెం, బీరోలు, జూపేడ గ్రామాల్లో పర్యటించారు. మండల మహిళ సమైక్య ద్వారా మంజూరైన గానుక, పల్లి ఆయిల్, పిండి మిల్లుతో పాటు, మిర్చి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దీంతో పాటు బీరోలు గ్రామంలో ఏర్పాటు చేసిన వికలాంగుల కేంద్రాన్ని ఎమ్మెల్యే కందాల ప్రారంభించారు.

ప్రతి నెలా వికలాంగుల మెట్నెస్ కింద ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలు తన సొంతంగా అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన వాలూరి నిఖిల్ బీఆర్ఎస్ సభ్యత్వం కలిగి ఉండడంతో పార్టీ అందించిన రెండు లక్షల ఇన్సూరెన్స్ చెక్కును కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మృతుడి తల్లి ఉమాకు అందించాడు. ఎమ్మెల్యే కందాల సిఫార్సు మేరకు రూ.16.25.500 వేల 49 సీఎంఆర్ఎఫ్ చెక్కులు అర్హులకు అందించారు. ఎంపీపీ బోడ మంగీలాల్, ఏపీఎం అలివేలు మంగ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బి.వీరన్న,సత్యనారాయణ రెడ్డి, పోలేపొంగు వెంకటేశ్వర్లు, సర్పంచులు దేవేందర్ రెడ్డి, అలివేలమ్మ, భిక్షం, ఎంపీటీసీలు, ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story