సత్తుపల్లి కాంగ్రెస్ గెలుపు గుర్రం మట్టానా ?

by Sumithra |   ( Updated:2023-06-07 15:04:05.0  )
సత్తుపల్లి కాంగ్రెస్ గెలుపు గుర్రం మట్టానా ?
X

దిశ, పెనుబల్లి : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఖమ్మం జిల్లాకు ఉన్న ప్రత్యేకతే వేరు. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి నియోజకవర్గం ఎప్పుడు హాట్ టాపిక్ గానే నిలుస్తుంది. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. జిల్లాలోని కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు అత్యధికంగా ఉన్న నియోజకవర్గంలో సత్తుపల్లి ఒకటి అనడం ఎటువంటి సందేహం లేదు. అటువంటి ఓటు బ్యాంకుతో గెలుపు తీరాలకు తీసుకువెళ్లే సరైన నాయకుడు ఇప్పటి వరకు సత్తుపల్లి నియోజకవర్గంలో లేకపోవడంతో గత 20 సం.రాలుగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓటమి చవిచూస్తూనే ఉంది. అయితే ఈసారి ఆ ట్రెండ్ మారనుందా? మట్టా దయానంద్ ఉన్న అవకాశాలు ఏమిటి ఇప్పుడు పరిశీలిద్దాం.

దయానంద్ (రాగమయి దంపతులు)..

ఇటీవలే కాంగ్రెస్ పార్టీలోకి చేరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సత్తుపల్లి పట్టణ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి తమ సత్తా ఏమిటో స్థానికులైన మట్టా దయానంద్ రాగమయి దంపతులు నిరూపించారు. మట్టా దయానంద్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరుడైనప్పటికీ ఇటీవల కాలంలో శ్రీనివాస్ రెడ్డిని విభేదించి సొంత ఎజెండాతో ప్రజల్లోకి వెళుతూ అనునిత్యం ప్రజలతో మమేకమై ఉంటున్నాడు. మట్టా దయానంద్ రాగమయి దంపతులు వైద్య వృత్తి చేస్తూ ప్రజలలో మంచి నమ్మకాన్ని పొందడమే కాక , ఆశ సేవా స్వచ్ఛంద సంస్థ ద్వారా నిరంతరం సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మట్టా దయానంద్ సౌమ్యుడు, నిరాడంబరుడు, మృదుస్వభావి ముఖ్యంగా ఎవరికి హాని తల పెట్టని, సత్ప్రవర్తన కలిగిన డాక్టర్ గా ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు.

ఏ పార్టీతో సంబంధం లేకుండా సొంత ఓటు బ్యాంక్ ఏర్పాటు చేసుకున్నాడు అనడంలో ఎటువంటి సందేహము లేదు. ముఖ్యంగా మట్టా దయానంద్ 2014 ఎన్నికలలో సత్తుపల్లి నియోజకవర్గంలో కేవలం అతి కొద్ది ఓట్ల తేడాతోనే ఓడిపోయాడు అనే సానుభూతి అన్ని వర్గాల ప్రజల్లోనూ ఉంది. ఈ సానుభూతే మట్టా దయానందుకు చాలా బాగా కలిసి వచ్చే అంశం అని అనడంలో ఎటువంటి సందేహం లేదని అభిమానులు నమ్మకం.

మట్టా దయానంద్ అధికార పార్టీ పై ఉన్న వ్యతిరేకత ఓటు బ్యాంకు కేవలం తనకు మాత్రమే అనుకూలంగా మార్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నవాడని నియోజకవర్గ ప్రజల గుసగుసలు. దీనికి మట్టా సొంత ఓటు బ్యాంకు, కాంగ్రెస్ ఓటు బ్యాంకు, కాంగ్రెస్ పార్టీలో మట్టాదాయానంద్ రాగమయి దంపతులుగెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదని ప్రజాభిప్రాయం. ఇదే కాక సత్తుపల్లి ప్రాంతం మాజీ మంత్రులు ఆశీస్సులు ఎట్లాగో మట్టాకే ఉన్నాయనే ప్రచారం కూడా ఆయనకు కలిసొచ్చే అంశం. భవిష్యత్తులో సత్తుపల్లి నియోజకవర్గంలో ఏ రాజకీయ సమీకరణాలే జరిగిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మట్టా దయానంద్ కే ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయనేది కాంగ్రెస్ అభిమానుల ప్రగాఢ విశ్వాసం.

తనకంటూ సొంత ఓటు బ్యాంకు ఏర్పాటు చేసుకున్న స్థానికులైన మట్టా దయానంద్ దంపతులకే సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే మట్టా దయానంద్ రాగమయి దంపతులు మాత్రం మేము లోకల్ అంటున్నారు.

Advertisement

Next Story