రామగుండంలో విషాదం.. కొత్తగూడెంవాసి మృతి

by S Gopi |   ( Updated:2023-02-04 07:18:06.0  )
రామగుండంలో విషాదం.. కొత్తగూడెంవాసి మృతి
X

దిశ, రామగిరి: రామగుండం 3 ఏరియా ఓసీ1 సీహెచ్ పీలో శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. ఓసీ1 సీహెచ్పీలో ట్రైనీ వెల్డర్ గా బట్టి జైనాధ్ కుమార్ (28) విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం ఫస్ట్ షిఫ్ట్ లో సీహెచ్ పీ సర్ఫేస్ ఫీడర్ ప్రక్కన ఉదయం సుమారు పది గంటల సమయంలో ఫైర్ ఎక్సనెంజర్ బ్లాస్ట్ కావడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఏరియా హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలియజేశారు. మృతుడి స్వస్ధలం కొత్తగూడెంలోని చుంచుపల్లి. మృతుడికి భార్య, 3 సంవత్సరాల కుమారుడు ఉన్నట్లు సమాచారం.

Advertisement

Next Story