నాటు సారా తయారీ కేంద్రాలపై ఉక్కుపాదం మోపుతాం

by Sridhar Babu |
నాటు సారా తయారీ కేంద్రాలపై ఉక్కుపాదం మోపుతాం
X

దిశ,మణుగూరు/పినపాక : నాటు సారా తయారుచేసి అమ్మకానికి సహకరించిన వారిపై కఠిన చర్యలతో పాటు కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ సీఐ కిషోర్ బాబు హెచ్చరించారు. మంగళవారం ఆయన పినపాక మండలం తహసీల్దార్ కార్యాలయంలో మాట్లాడారు. నాటు సారా, బెల్లం విక్రయించిన వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నియోజకవర్గంలో

తయారీ స్థావరాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. పలు గ్రామాల్లో దాడులు నిర్వహించి నాటు సారా తయారీకి ఉపయోగించే బెల్లం, నాటు సారాను ధ్వంసం చేశామన్నారు. పలువురు నాటు సారా తయారీదారులను బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఎవరైనా నాటు సారా తయారు చేసినా లేదా విక్రయించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాకుండా కేసులు నమోదైన వ్యక్తులు నాటు సారా తయారు చేస్తే ఆ వ్యక్తులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు.

Next Story

Most Viewed