- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Former MLA : జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం..
దిశ, సత్తుపల్లి : జర్నలిస్టులందరికీ సత్తుపల్లిలో ఇళ్ల స్థలాలు త్వరలోనే ఇస్తామని, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ అన్నారు. సోమవారం జై కన్వర్షన్ ఫంక్షన్ హాల్ లో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మాదిరాజు సుధాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సత్తుపల్లి ప్రెస్ క్లబ్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడుతూ 25 లక్షల రూపాయలతో జర్నలిస్టుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామని, జర్నలిస్టులతో పాటు వారి కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు.
సత్తుపల్లిలోని సింగరేణి పొల్యూషన్ నివారించడానికి 30 వేల మొక్కలు నాటేందుకు కృషి చేస్తామని అందులో జర్నలిస్టులు కూడా భాగస్వాములు కావాలని ఆయన ఆహ్వానించారు. ప్రతి జర్నలిస్టు రాజకీయాలకతీతంగా సమాజంలో మంచి చెడులను ప్రజలకు వివరించాలని ప్రజల పక్షాన జర్నలిస్టుల పని చేయాలని ఆయన ఆకాంక్షించారు. అధ్యక్షులు కార్యదర్శులను శాలవాతో ఘనంగా సన్మానించి నూతనంగా ఎంపికైన ప్రెస్ క్లబ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జర్నలిస్టుల వినతులతో కూడిన వినతిపత్రం ఆయనకు అందజేశారు. పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు
జర్నలిజం వృత్తి కత్తి మీద సాములాంటిదే.. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
ప్రస్తుత కాలంలో జర్నలిజం వృత్తి కత్తి మీద సాములాంటిదేనని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. సత్తుపల్లి ప్రెస్ క్లబ్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ సమాజంలో ఎప్పుడూ ప్రజల పక్షాన ఉండి ప్రజాసమస్యలను లేవనెత్తే జర్నలిస్టులకు అనేక ఇబ్బందులు తప్పడం లేదని రాజకీయ నాయకులు తమకు అనుకూలమైన వార్తలు రాస్తే ప్రశంసించడం, వ్యతిరేక వార్తలు రాస్తే ఇబ్బందులకు గురిచేయటం నేటి సమాజంలో సర్వసాధారణమైనదని అన్నారు. ఎలాంటి బెదిరింపులకు లొంగకుండా పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. నూతన ప్రెస్ క్లబ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మాదిరాజు సుధాకర్, కార్యదర్శి నర్రా అరుణ్ ను పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు.
సమాజంలో జర్నలిస్టుల ది కీలక పాత్ర.. కల్లూరు ఏసీపీ అనిశేట్టి రఘు.. సత్తుపల్లి పట్టణ సీఐ టీ కిరణ్
సమాజంలో జర్నలిస్టులది కీలక పాత్ర అని కల్లూరు ఏసీపీ అనిశెట్టి రఘు, సత్తుపల్లి పట్టణ సీఐ టీ కిరణ్ అన్నారు. సత్తుపల్లి ప్రెస్ క్లబ్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అన్యాయం అక్రమాలను ప్రజలకు వివరించి ప్రజలను చైతన్యవంతులు చేసే రంగం మీడియా రంగమని మీడియా అంటే నాలుగో స్తంభం అని ఈ సందర్భంగా వారు తెలిపారు. నూతనంగా ఎన్నుకున్న ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కార్యదర్శులు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి, సీనియర్ జర్నలిస్ట్ నంబూరి రామలింగేశ్వరరావు మాట్లాడుతూ జర్నలిజంలో తాను ఎదుర్కొన్న పలు సమస్యలను, ఇబ్బందులను జర్నలిస్టులకు వివరించారు. సమాజంలో జర్నలిస్టులు ఆదర్శవంతంగా జీవించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మాదిరాజు సుధాకర్, పలువురు సీనియర్ జర్నలిస్టులు తదితరులు మాట్లాడుతూ, జర్నలిస్టులు వృత్తిలో అంకితభావంతో పని చేయాలని వారి సూచనలు సలహాలు అందించారు.
ఈ ఆత్మీయ సమావేశంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసం పూడి మహేష్, జడ్పీటీసీ సభ్యులు కే రామారావు, ఎంపీపీ దొడ్డ హైమావతి శంకర్రావు, మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మండల అధ్యక్షులు యాగంటి శ్రీనివాసరావు, బీఆర్ఎస్ యువజన నాయకులు వల్లభనేని పవన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉడతనేని అప్పారావు, చల్లగుళ్ళ నరసింహారావు, బీజేపీ జిల్లా నాయకులు రాఘవరావు, మండల అధ్యక్షులు పాలకుర్తి శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి కమల్ పాషా, దొడ్డ శ్రీనివాసరావు, ప్రైవేట్ స్కూల్లో యాజమాన్య సంఘం నాయకులు, నాయుడు వెంకటేశ్వరరావు, పసుమర్తి చిన్న నాగేశ్వరరావు, ప్రెస్ క్లబ్ సభ్యులు, స్థానిక కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.