పాలేరులో పోటీ చేస్తాం : తమ్మినేని

by Sridhar Babu |   ( Updated:2022-12-15 14:40:48.0  )
పాలేరులో పోటీ చేస్తాం : తమ్మినేని
X

దిశ,తిరుమలాయపాలెం : ఇతర రాజకీయ పార్టీలతో పొత్తులున్నా లేకున్నా పాలేరులో తాము పోటీ చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టంచేశారు. గురువారం మండల పరిధిలోని పిండిప్రోలు గ్రామంలో ఆ పార్టీ మండల కార్యదర్శి కొమ్ము శ్రీను అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ సమావేశానికి ముఖ్యతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతతత్వ బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో ఓడించేందుకు భారత సమితితోపాటు, కలిసొచ్చే ఏ పార్టీతోనైనా పనిచేస్తామన్నారు. అందుకు ఉదాహరణ మునుగోడు ఎలక్షన్ ఫలితాలేనని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎలక్షన్ వాతావరణం కనిపిస్తుందని, పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈనెల 29న ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజిఎన్ఆర్ గ్రౌండ్లో రైతు సంఘం బహిరంగ మహాసభ ఉంటుందని, కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ పాల్గొంటారని తెలిపారు. కావున అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొని బహిరంగా సభను జయప్రదం చేయాలని అన్నారు. అనంతరం తమ్మినేని సమక్షంలో వివిధ గ్రామాల నుంచి సీపీఎంలో చేరారు. ఈ జనరల్ బాడీలో జిల్లా కార్యదర్శి నున్నం నాగేశ్వరరావు, నియోజకవర్గ ఇన్చార్జి బండి రమేశ్, నాయకులు బషీరుద్దీన్, నర్సయ్య, స్వామి,వెంకటేశ్వర్లు, ఉపేందర్ పాల్గొన్నారు.

Advertisement

Next Story