- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Vaira MLA : రైతుల సంక్షేమ ధ్యేయంగా పని చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
దిశ, వైరా : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైరాలో గురువారం నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను జయప్రదం చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలు, రైతులకు, నియోజకవర్గ ప్రజలు, అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వైరారైతు సదస్సులో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయటం చారిత్రాత్మకమన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను విడుదల చేయటం ఈ ప్రాంత రైతుల అదృష్టమని అన్నారు. వరంగల్ సభలో రాహుల్ గాంధీ ఇచ్చిన రెండు లక్షల రూపాయల రుణమాఫీ వాగ్దానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మంత్రివర్గం అమలు చేసి చూపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ పెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు శీలం వెంకట నర్సిరెడ్డి , వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, టౌన్ అధ్యక్షుడు ఏదునూరి సీతారాములు, మట్టూరి కృష్ణారావు , పని సైదులు, మిట్టపల్లి నాగి, దార్న రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.