అపరిశుభ్రంగా ప్రభుత్వ ఆసుపత్రి..

by Aamani |
అపరిశుభ్రంగా ప్రభుత్వ ఆసుపత్రి..
X

దిశ,కొత్తగూడెం : అనారోగ్యంతో చికిత్స కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు కొత్త రోగాలు కొని తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. కొత్తగూడెం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రధాన ద్వారం పక్కన ఉన్న సెప్టిక్ ట్యాంక్ నిండిపోయి మురుగునీరు, బురద నీరు తొ పొంగి ఆస్పత్రి ఆవరణ మొత్తం దుర్గంధం వెదజల్లుతుంది. ఆ మురుగు నీరు ప్రవహించే గేటు ని దాటుకొని ఆసుపత్రికి వచ్చేవారు రావలసి ఉంటుంది. ఒకపక్క సీజనల్ వ్యాధులు ప్రబలుతుంటే మరొక పక్క ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఈ అపరిశుభ్ర వాతావరణం ఉండటంతో ప్రజలు అసహనానికి గురవుతున్నారు. అనారోగ్యం బారిన పడి చికిత్స కోసం వస్తే ఈ సెప్టిక్ ట్యాంక్ నీటి వలన మరిన్ని కొత్త రోగాలను అంటించుకునే ప్రమాదం ఉందని చర్చించుకుంటున్నారు. గత రెండు నెలలుగా సెప్టిక్ ట్యాంక్ నిండిపోయి దుర్గంధం వెదజల్లుతోందని, అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని ఆస్పత్రికి వచ్చేవారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed