- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ లో కుదరని సయోధ్య
దిశ, గుండాల : ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ పినపాక నియోజకవర్గంలోని గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో కాంగ్రెస్ లో వర్గపోరు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పూర్వం నుండి కాంగ్రెస్ లో పనిచేస్తున్న కార్యకర్తలను ఇటీవల కాలంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు పట్టించుకోవడంలేదని పాత కాంగ్రెస్ నాయకుల ఆరోపిస్తున్నారు. ఈ మండలాల్లో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొత్తగా వచ్చిన టీం పాత కాంగ్రెస్ మండల కమిటీని సంప్రదించకుండా ఆరు గ్యారెంటీలు ప్రచారం చేయడంతో పాటు సమన్వయం చేసుకోవడంలో వైఫల్యం చెందారని పాత కాంగ్రెస్ నాయకుల ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే రెండు వర్గాలను సమన్వయ పరిచి సయోధ్య కుదిరించేందుకు పినపాక నియోజక వర్గ కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు గురువారం ఇరువర్గాలతో గుండాల మండలంలోని పగిడిద్దరాజు గద్దల వద్ద సమావేశం ఏర్పాటు చేశారు. కాగా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ వర్గీయులు తమని కల్పుకుపోవడంలో వైపల్యం చెందారని వాళ్లతోనే కలిసి పనిచేయడం తమ వల్ల కాదని పాత కాంగ్రెస్ నాయకులు పాయం ముందే తేల్చి చెప్పారు. పాయం సయోధ్య ఫలించకపోవడంతో తిరిగి ఆరో తేదీకి ఇరు వర్గాలను కూర్చోబెట్టి సమన్వయం చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రెండు వర్గాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు ప్రత్యర్థి కలిసొస్తుందని మండలంలోని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.