ఆర్ఎంపీ ఆసుపత్రులపై టీఎస్ఎంసీ తనిఖీలు

by Disha Web Desk 15 |
ఆర్ఎంపీ ఆసుపత్రులపై టీఎస్ఎంసీ తనిఖీలు
X

దిశ, ఖమ్మం : ఖమ్మం జిల్లాలోని ఆర్ఎంపీల ఆస్పత్రులపై తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇటీవల ఖమ్మం నగరంలోని ఎన్ఎస్టీ రోడ్ లో అబ్దుల్ హమీద్ అనే ఆర్ఎంపీ ఆరు సంవత్సరాల బాలుడిని సున్నీ చేస్తూ మర్మాంగాన్ని కట్ చేసిన ఘటన పై తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ సుమోటోగా పరిగణలో తీసుకుంది. అందులో భాగంగానే గురువారం డాక్టర్ల బృందం ఖమ్మం వచ్చారు. ఎన్ఎస్టీ రోడ్, సిరిత క్లినిక్ సెంటర్, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆర్ఎంపీ ఆసుపత్రులను

తనిఖీలు చేశారు. ఎన్ ఎస్ టీ రోడ్ లో ఉన్న స్వప్న క్లినిక్ నడిపిస్తున్న ఆర్ఎంపీ వైద్యుడు నల్లమోతు కోటేశ్వరరావు ఆసుపత్రికి వెళ్లి ఆస్పత్రి ప్రిపరేషన్, మందులను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అర్హత లేకుండా వైద్యం చేయటం నేరమని ఆర్ఎంపీ వైద్యుని హెచ్చరించారు. అనంతరం మర్మాంగం తెగిన బాధితుడు ఇంటికి వెళ్లి వివరాలను సేకరించారు. జరిగిన ఘటనపై రికార్డు చేశారు. వరంగల్ నుంచి టీఎస్ఎంసీ డాక్టర్ల బృందం వచ్చారని సమాచారంతో కొంతమంది ఆర్ఎంపీలు వైద్యశాలలు మూసివేశారు. ఈ బృందం జిల్లాలో రెండు రోజుల పాటు తనిఖీలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.



Next Story

Most Viewed