- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మద్యం మత్తులో హిట్ అండ్ రన్ చేసిన ఐఏఎస్ అధికారి!
దిశ, డైనమిక్ బ్యూరో: సాధారణ ప్రజలకు రూల్స్ చెప్పే అధికారులే కొందరు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదు. అందులోనూ ఓ ఐఏఎస్ అధికారి. మద్యం మత్తులో ఓ ఐఏఎస్ అధికారి హిట్ అండ్ రన్ చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనికి సబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన ఓ ఐఏఎస్ అధికారి మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. నల్లకుంటలో వేగంగా కారు నడిపి బైకుని అధికారి ఢీకొట్టించారు.
ఇదేంటని నిలదీసిన వారిపై దురుసుగా ప్రవర్తించారని, ఆపై అక్కడి నుంచి పరారీ అయ్యాడని తెలిసింది. మే 18 వ తేదీన ఈ ఘటనకు సంబంధించి నల్లకుంట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మద్యం బాటిళ్లు కూడా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలోనే నెటిజన్లు అధికారిపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేశారు.