ఎమ్మెల్సీ తాత మధుసూదన్‌కి ఘనస్వాగతం పలికిన టీఆర్ఎస్ శ్రేణులు

by Disha News Desk |
ఎమ్మెల్సీ తాత మధుసూదన్‌కి ఘనస్వాగతం పలికిన టీఆర్ఎస్ శ్రేణులు
X

దిశ, పాలేరు: టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా నియమితులైన ఎమ్మెల్సీ తాత మధుసూదన్ తొలిసారిగా జిల్లాకు వస్తున్న సందర్భంగా జిల్లా సరిహద్దు నాయకన్ గూడెం వద్ద తెరాస పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జిల్లా సరిహద్దుకు చేరుకోగానే గజమాలతో పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓపెన్ టాప్ రథంలో కూసుమంచి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాప్ కార్యాలయానికి చేరుకున్నారు. పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.

టీఆర్ఎస్ నాయకులు ఉపేందర్ రెడ్డి, తాతా మధును గజమాలతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ.. అంకిత భావంతో ప్రతి ఒక్కరి సహకారంతో ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. రాబోయే రోజుల్లోనూ పార్టీ శ్రేణులందరూ కలిసి కట్టుగా టీఆర్‌ఎస్‌ విజయం కోసం పాటు పడాలనికోరారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ ఇంటూరి రాజశేఖర్, కూసుమంచి ఎంపీపీ శ్రీనివాస్, జడ్పీటీసీ వరప్రసాద్, నాలుగు మండలాల టిఆర్ఎస్ అధ్యక్షులు వీరన్న, వీరయ్య, వేణుగోపాల్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story