దళారుల దగా.. పత్తి రైతును దోచుకుంటున్న వ్యాపారులు

by Sumithra |
దళారుల దగా.. పత్తి రైతును దోచుకుంటున్న వ్యాపారులు
X

దిశ, తల్లాడ : తల్లాడ మండలం ప్రైవేట్ (దళారులు) వ్యాపారులు రైతులను నిలువునా ముంచుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంట విక్రయించడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పత్తి, ధాన్యం తదితరులు పంటలకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గతంలో మద్దతు ధర ప్రకటించంది. కానీ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు అంతంత మాత్రమే ఉండటంతో చేసేదేమీ లేక రైతులు పత్తి మిల్లుల యాజమానుల, దళారులు ఆశ్రయిస్తూ వారు అడిగిన ధరకు అమ్ముకొని నష్టపోతున్నారు. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీ పెరుగుతుండటం పత్తి నిల్వ చేయడానికి స్థలం లేకపోవడం పత్తి ఏరిన కూలీలకు వెంటనే కూలి డబ్బులు ఇవ్వాల్సి ఉండటంతో రైతులకు ఏమి చేయలేని పరిస్థితిలో తక్కువ ధర అయినా సరే పత్తి అమ్ముకుంటున్నారు.

తల్లాడ మండలంలో కొన్ని వేల ఎకరాల్లో పత్తి సాగు చేయడంతో లక్షల దిగుబడి వస్తుందని అంచన ఉన్నా.. వర్షాలు సకాలంలో కురవక పత్తి చేలు దెబ్బతిన్నాయి. గతంలో ఎకరానికి 10 నుంచి 15 క్వింటాళ్ల పత్తికి దిగుబడి వచ్చింది. ఈ సారి ఐదు క్వింటాలు కూడా వచ్చేలా పరిస్థితి లేదు. 8 శాతం తేమ ఉన్న నాణ్యమైన పత్తికి ప్రభుత్వం మద్దతు ధర క్వింటాకు రూ. 6500 నుంచి రూ.7521 ఆ పైన తేమ పెరిగితే ఒక శాతానికి చొప్పున ధర తగ్గిస్తారు. గరిష్టంగా 12 శాతం తేమ ఉంటే రూ.6,220.16 పైసలు చెల్లిస్తారు. తేమ శాతం 12 కు మించి ఉంటే కొనరు.

కొనుగోలు కేంద్రాల ఆలస్యం..

పత్తి కొనుగోలు కేంద్రాలు అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభిస్తే రైతులకు ఉపయోగకరంగా ఉండేది. గత రెండు సీజన్లో నవంబర్ నెలలో కేంద్రాల ప్రారంభమయ్యాయి. ఈ సీజన్లో కూడా ప్రతి కొనుగోలు కేంద్రాలు నవంబర్లోనే ప్రారంభమవుతాయనే అనుమానంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు పత్తి విక్రయిస్తున్నారు. రైతులు పత్తిని మిల్లులకు, ప్రైవేటు వ్యాపారాలకు క్వింటాకు రూ.5300 నుంచి రూ.6500 వరకు విక్రయిస్తున్నారు. దీనికి రెండు కిలోల తరుగు, రెండు శాతం కమీషన్. పత్తిలో తేమ ఎక్కువగా ఉంటోందని, ధర తగ్గిస్తున్నామని వ్యాపారాలు చెబుతున్నారు. పత్తిలో 25 శాతం తేమ ఉన్న 6282. 43 పైసలు ధర ఇవ్వాలి. కానీ వ్యాపారులు 8 శాతం తేమ ఉన్న పత్తికి క్వింటాకు 6,300 ఇస్తూ 25 శాతం తేమ ఉన్నప్పటికీ రూ.5200 నుంచి రూ.5300 లే ఇస్తున్నారు.

పెట్టుబడి సైతం రావడం లేదు.. రాయల రమేశ్ రైతు, సీసీఐ కేంద్రాల్లోనే విక్రయించాలి

ప్రభుత్వం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు, పత్తి మిల్లుల యజమానులు తక్కువ ధరకు కొంటున్నారు. ఈ ఏడాది అదును ప్రకారం వర్షాలు పడక పత్తి దిగుబడి తగ్గింది. ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకుంటే పెట్టుబడులు సైతం చేతికి రాక అప్పులు మీద పడుతున్నాయి. పత్తి సీసీఐ కేంద్రాల్లో అమ్మకానికి పెడితే వారం నుంచి పది రోజుల వరకు గడువు పెడుతున్నారు. దళారులు అయితే వెంటనే చేతికి నగదు ఇస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని పత్తి కొనుగోలు చేసిన వెంటనే రైతు అకౌంట్లో నగదును జమ చేయాలి.

మొహమ్మద్ అబ్దుల్ అలీం, ఎండీఓ జిల్లా మార్కెటింగ్ కార్యదర్శి

తల్లాడ మండలంలోని జిన్నింగ్ మిల్లు వద్ద సీసీఐ కేంద్రం ఏర్పాటు చేశాం. పత్తి రైతులు 8 శాతం నుంచి 12 శాతం వరకు ఉన్న పత్తిని అమ్మకం జరిపితే గిట్టుబాటు ధర వస్తుంది. దళారుల చేతిలో మోసపోకుండా రైతులు సీసీఐ కేంద్రాల్లోనే అమ్మకాలు జరపాలి. రైతులు వాట్సాప్ 8897281111టోల్ ఫ్రీ నెంబర్‌కు హాయ్ అని మెసేజ్ పెడితే ఎంత పంట అమ్మారు. తేమ శాతం ఎంత వచ్చింది.. డబ్బులు ఖాతాలో జమ అయ్యాయో లేదో మెసేజ్ వస్తుంది.

Advertisement

Next Story

Most Viewed