సాయిపల్లవిపై మణిరత్నం సంచలన వ్యాఖ్యలు.. ఆ కోరిక ఉందంటూ

by Kavitha |
సాయిపల్లవిపై మణిరత్నం సంచలన వ్యాఖ్యలు.. ఆ కోరిక ఉందంటూ
X

దిశ, సినిమా: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ప్రేమమ్’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. సినిమాల్లో మినిమల్ మేకప్, బోల్డ్ సీన్స్‌లో యాక్ట్ చేయను అనే రూల్స్ పెట్టుకోవడంతో ఈ అమ్మడుపై అభిమానం మరింత పెరిగిపోయింది. ఇక ఈ ముద్దుగుమ్మ డాన్స్‌కు అయితే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది సాయి పల్లవి.

ఇదిలా ఉంటే.. కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ హీరోగా, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్‌గా తెరకెక్కిన తాజా చిత్రం ‘అమరన్’. బయోగ్రాఫికల్ యాక్షన్ ఫిల్మ్‌గా రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీలో శివకార్తికేయన్ ఆర్మీ అధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో కనిపించనున్నారు. కాగా సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మూవీ టీమ్ ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉన్నారు. అందులో భాగంగా తాజాగా చెన్నై వేదికగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.

అయితే ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు అతిథులుగా విచ్చేశారు. ఇక హీరో శివకార్తికేయన్‌ నుంచి అతిథిగా విచ్చేసిన లెజెండ్రీ డైరెక్టర్‌ మణిరత్నం వరకూ సాయిపల్లవిని పొగడ్తలతో ముంచెత్తారు. మణిరత్నం అయితే.. ఒకడుగు ముందుకేసి, 'నేను సాయిపల్లవి అభిమానిని. ఆమెతో సినిమా చేయాలనుంది. తప్పకుండా చేస్తా' అని వేలాది జనాల సాక్షిగా చెప్పేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్‌గా మారగా.. సాధారణంగా మణిరత్నం దర్శకత్వంలో నటించాలని హీరోయిన్లందరూ కలలు కంటుంటారు. కానీ ఇక్కడ సీన్‌ రివర్స్‌ అయ్యిందే అని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story