పాడైపోతున్న ప్యాడి క్లీనర్లు.. పట్టించుకునేది ఎవరు ?

by Sumithra |
పాడైపోతున్న ప్యాడి క్లీనర్లు.. పట్టించుకునేది ఎవరు ?
X

దిశ, శంకరపట్నం : రైతులు పండించిన వరి ధాన్యంలో తాలు తొలగించడం కోసం ఐకేపీ సెంటర్లకు కేటాయించిన ధాన్యం శుభ్రపరిచే యంత్రాలు (ప్యాడీ క్లీనర్) తాడికల్ సహకార సంఘం పాలకవర్గం నిర్లక్ష్యంతో పనికి రాకుండా పోతున్నాయి. వివరాల్లోకి వెళితే శంకరపట్నం మండలంలోని తాడికల్ సహకార సంఘం పరిధిలోని కరీంపేట గ్రామానికి గత రబీ సీజన్లో రైతుల సౌకర్యార్థం ప్యాడి క్లీనర్ ను కేటాయించారు. రబీ సీజన్ ముగిసి ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్న ధాన్యం శుభ్రపరిచే యంత్రంను ఎస్సారెస్పీ కాలువ పక్కన ఐకేపీ సెంటర్ నిర్వహించిన ప్రాంతంలోనే, నిర్లక్ష్యంగా వదిలివేయడంతో వర్షానికి తడుస్తూ, ఎండకు ఎండుతూ పనికి రాకుండా పోయింది.

దీనితో పలువురు రైతులు సహకార సంఘం పనితీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయల ప్రభుత్వ సొమ్ముతో కొనుగోలు చేసిన ప్యాడి క్లీనర్ లను సీజన్ పూర్తి కాగానే భద్రపరచాల్సిన సహకార సంఘం వాటి నిర్వహణను గాలికి వదిలేయడంతో ఎక్కడివి అక్కడే తుప్పుపట్టే పరిస్థితి వచ్చిందని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సహకార సంఘం సభ్యులు నిర్లక్ష్యం వీడాలని గ్రామ రైతులు కోరుతున్నారు.

Advertisement

Next Story