Tachophobia : కదులుతున్న వాహనం చూస్తే భయమా..? అసలు కారణం ఇదే!

by Javid Pasha |
Tachophobia : కదులుతున్న వాహనం చూస్తే భయమా..? అసలు కారణం ఇదే!
X

దిశ, ఫీచర్స్ : కొందరు బస్సు, కారు, బైకు.. ఇలా ఏ వెహికల్ ఎక్కాలన్నా భయపడుతుంటారు. కదులుతున్న వాహనాలు చూసి ఆందోళన చెందుతుంటారు. ఒకవేళ ఎక్కినా అవి కాస్త స్పీడ్ అందుకోగానే కంగారు పడిపోతుంటారు. దీంతో ప్రయాణాలు చేయడానికి ఇష్టపడరు. ఈ విధమైన భయాన్నే మానసిక నిపుణులు స్పీడ్ ఫోబియా లేదా టాకో ఫోబియాగా పేర్కొంటున్నారు. ఇది ఎందుకు ఏర్పడుతుంది? లక్షణాలేమిటి? ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక వ్యక్తి ఆందోళన చెందడం వెనుక దానికి సంబంధించిన తీవ్రమైన పరిస్థితులు, మానసిక ఒత్తిడి, భావోద్వేగాలు కారణం కావచ్చు. టాకోఫోబియా ఆ కోవకు చెందినదే. ఉదాహరణకు ఒక వ్యక్తి బైకు మీదో, కారులోనో వెళ్తూ రోడ్డు ప్రమాదం మరణించడం, తమ కళ్లముందే ప్రమాదానికి గురికావడం వంటివి చూసిన వ్యక్తుల్లో ఈ టాకోఫోబియా సంభవించే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. దీంతో బాధితులు యాక్షన్ సినిమాలు, గేమ్స్‌ వంటివి చూస్తున్నా వాటిలో దూసుకుకొచ్చే వాహనాల సన్నివేశాలు చూసి కూడా భయపడతారు. కార్లు, బస్సులు ఎక్కి ప్రయాణాలు చేయడానికైతే అస్సలు ఆసక్తి చూపరు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేసినా వీరు ఛాతీ నొప్పి, భయం, ఆందోళన, హార్ట్ రేట్ పెరగడం, వికారం, వాంతింగ్, అధిక చెమటలు పట్టడం వంటి లక్షణాలను ఎదుర్కొంటారు.

భయం పోయేదెలా?

టాకోఫోబియా ఉన్నట్లు గుర్తిస్తే మానసిక వైద్య నిపుణులను సంప్రదించాలి. వారు అందుకు గల మూల కారణాలు తెలుసుకొని సరైన పద్ధతిలో చికిత్స అందిస్తారు. కాగ్నెటివ్ బిహేవియరల్ థెరపీ, టాక్ థెరపీ వంటి చికిత్సలతో టాకో ఫోబియాను శాశ్వతంగా తగ్గించవచ్చునని సైకాలజిస్టులు అంటున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed