- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మలేషియాకు రావాలని కేటీఆర్‌కు ఆహ్వానం
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)కు మలేషియా తెలంగాణ అసోసియేషన్(Malaysian Telangana Association) ఆహ్వానం పంపింది. మలేషియా తెలంగాణ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాలకు రావాలని ఆహ్వానించింది. వచ్చే నవంబర్ 9వ తేదీన మలేషియాలోని కౌలాలంపూర్‌లో ఈ దశాబ్ది ఉత్సవాలు జరిగుతాయని పేర్కొంది. ఈ ఉత్సవాలకు మలేషియాలోని తెలంగాణ వాసులు పెద్ద ఎత్తున హాజరవుతారని తెలిపింది. హైదరాబాద్‌లోని నంది నగర్ కేటీఆర్ నివాసంలో మలేషియా తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షులు తిరుపతి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం కేటీఆర్‌కు ఆదివారం ఆహ్వానం అందించారు. కేవలం మలేషియాలోని తెలంగాణ వాసులే కాకుండా అనేక దేశాల నుంచి ఈ ఉత్సవాలకు ప్రత్యేకంగా తెలంగాణ ప్రముఖులు హాజరు కానున్నారని కేటీఆర్‌కు తెలియజేశారు.
తెలంగాణ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించినందుకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ వెళ్లినా ఏ దేశం వెళ్లినా తెలంగాణ ప్రాంతీయులు తెలంగాణ రాష్ట్రం పట్ల తెలంగాణ ప్రజల పట్ల ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తున్నారని కేటీఆర్ అన్నారు. గుర్తుచేశారు. మలేషియాలోనూ తెలంగాణ వాసులు తమకంటూ ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసుకొని అనేక రకాల కార్యక్రమాల్లో తెలంగాణ గడ్డతో మమేకం కావడం పట్ల అభినందనలు తెలియజేశారు. ఈ ప్రస్థానంలో 10 సంవత్సరాల మైలురాయిని విజయవంతంగా పూర్తి చేసుకున్న మలేషియా తెలంగాణ అసోసియేషన్ కి శుభాకాంక్షలు తెలిపారు.