- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాలేరులో నేనే పోటీ చేస్తా : టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు..
దిశ, కూసుమంచి : భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీదే అని టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ముదిగొండ మండలం వెంకటాపురంలో మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వార్ వన్ సైడే అని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతున్నారంటే ఆయన ఏ పార్టీ నుంచి గెలిచారో ఆ పార్టీదే వార్ వన్ సైడ్ అని అర్థమని పేర్కొన్నారు. మా కుటుంబం కమ్యూనిస్టు కుటుంబం అయినప్పటికీ నేను ఆ పార్టీ సభ్యడ్ని కాదన్నారు. ప్రజాప్రతినిధులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వానికి తెలియజేసేందుకే ఓడిపోతామని తెలిసినప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశామన్నారు. ఆ ఎన్నికల్లో 90 ఓట్లున్న కాంగ్రెస్ 242 సాధించి నైతిక విజయం సాదించామన్నారు.
అధిష్టానం అశిస్సులతో పాలేరులో తానే పోటీ చేస్తా అన్నారు. ప్రజా వ్యతిరేకతను నుంచి తప్పించుకునేందుకే బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తుంద్నారు. అవసరం ఉందని తన దెగ్గరకు వచ్చిన వారికి కాదనకుండా తనకున్నదాంట్లో సహాయం చేశానన్నారు. ఏనాడూ ప్రచారం చేసుకోలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తనను బెదిరించినా, ప్రలోభాలకు గురి చేసినా తలవంచలేధన్నారు. పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటన్నారు. హాథ్ సే హాథ్ పేరుతో ప్రతి ఇంటికి కాంగ్రెస్ మేనిఫెస్టోను తీచుకుపోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు.
కొంత మంది అవాకులు, చావాకులు మాట్లాడుతున్నారని ఎవరెన్ని మాట్లాడినా అదిరేది, బెదిరేది లేదన్నారు. నేను పుట్టింది నేలకొండపల్లి, పెరిగింది ముదిగొండ మండలంలో అని ఎవరో వచ్చి నేను లోకల్ అంటుంటే నవ్వోస్తుందన్నారు. గతంలో తాను మంచి ఉద్దేశంతోనే ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేశానన్నారు. చివరి నిమిషం వరకు పోరాడి మన సత్తా చాటుదామని కార్యకర్తలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోమ్మినేని రమేష్, కాంగ్రెస్ సేవాదళ్ పాలేరు నియోజకవర్గ అధ్యక్షుడు బచ్చలకూరి నాగరాజు, యువజన నాయకులు యడవల్లి నాగరాజు, ఇలవల పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.