- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్తగూడెం నియోజకవర్గానికి వచ్చే టూరిస్ట్ నేతలతో జాగ్రత్తగా ఉండాలి : సాంబశివరావు
దిశ, పాల్వంచ రూరల్ : ఎన్నికల సమయంలో డబ్బు సంచులతో కొత్తగూడెం నియోజకవర్గానికి వచ్చే టూరిస్ట్ నాయకులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం పాండురంగపురంలో జరిగిన ఉమ్మడి పాండురంగపురం, సూరారం పంచాయతీల ఏడు బూత్ల స్థాయి కార్యకర్తల సమావేశం మండల సహాయ కార్యదర్శి గుండాల నాగరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కూనంనేని మాట్లాడుతూ రైతును రాజు చేస్తామన్న పాలకుల హామీలు అమలుకు నోచుకోకపోగా రైతాంగ వ్యతిరేక చట్టాలను రూపొందిస్తూ వారిని దివాళా తీయిస్తున్నారని విమర్శించారు. స్వామినాథన్ సిఫారసులను పరిగణలోకి తీసుకొని రైతాంగానికి చేయూతనందించాలని, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ చేశారు.
ఇంధన ధరలు, నిత్యావసర ధరలతో ప్రజలు సతమతమవుతుంటే ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయని, ఇటీవల గ్యాస్ ధరలను పెంచిన కేంద్రం పేదోడి నడ్డివిరుస్తోందని విమర్శించారు. ధరలను అందుబాటులోకి తెచ్చి పేదలు కనీసం రెండు పూటలా తిండితినే వెసులుబాటు కల్పించాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న పేదలకు గృహ వసతి కల్పించి వారి సొంతింటి కలను నెరవేర్చాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి స్థాయిలో జరగలేదని, ఇంకా ఎన్నేళ్లకు నిర్మాణాలు పూర్తి అవుతాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. లక్షల్లో పేదలు ఉంటే వేలల్లో నిర్మాణాలు చేపడుతున్నారని అన్నారు. ప్రభుత్వ స్థలాల్లో పక్కా గృహాలు నిర్మించి అర్హులైన పేదలకు అందించాలని, సొంత స్థలం ఉన్న వారికి రూ.6 లక్షల మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలకు అండ కమ్యూనిస్టులేనని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తూ పాలకులు, అధికారులను నిలదీసే సత్తా ఉన్న కమ్యూనిస్టు పార్టీని ప్రజలు ఆదరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, పట్టణ కార్యదర్శి అడుసుమిల్లి సాయిబాబు, జిల్లా సమితి సభ్యులు ఉప్పుశెట్టి రాహుల్, నాయకులు గుండెపురి రాజు, ఇరుకులపాటి నారాయణ, సర్పంచ్ భుక్య రమేష్, కోటి నాగేశ్వరరావు, ఇరుకులపాటి సుధాకర్, ఎర్రగడ్డ సత్యనారాయణ, నెల్లూరి సతీష్, జక్కుల సురేష్, ఆవుల సతీష్, ఇరుకులపాటి నాగేశ్వరరావు, జక్కుల సత్యనారాయణ, కొత్త సురేష్, గుగులోత్ భిక్షం, డేవిడ్, నాయక్, వెంకట్ నారాయణ, కె.కృష్ణ, వడ్లకొండ మేరమ్మ, వెంకన్న చారి, రేగు కృష్ణమూర్తి, కొత్త మధు, లింగంపల్లి నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, సురేష్, సంతోష్, మహమ్మద్ పాషా, కురు రమేష్ తదితరులు పాల్గొన్నారు.