పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే నేను

by Mahesh |   ( Updated:2023-12-07 06:27:24.0  )
పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే నేను
X

దిశ, తిరుమలాయపాలెం: పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే నేను అంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, దాదాపు పది సంవత్సరాల తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుంది. నేడు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో, సోనియాగాంధీ‌తో పాటు ఏఐసీసీ అగ్రనాయకుల సమక్షంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఆయనతో పాటు పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. పొంగులేటి తో పాటు ఖమ్మం జిల్లా నుంచి డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క (మధిర), తుమ్మల నాగేశ్వరరావు (ఖమ్మం) ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ముగ్గురు ఎమ్మెల్యేలు తెలంగాణ మంత్రులగా రేవంత్ కేబినెట్‌లో చోటు దక్కింది.

Advertisement

Next Story