- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ ఎన్నికలు చారిత్రాత్మకంగా నిలవాలి
దిశ, ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు చారిత్రాత్మకంగా నిలవాలని, దానికి ఖమ్మం ప్రధాన భూమిక పోషించాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని 40,41 డివిజన్లలో ఆయన రోడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సూచనల మేరకు తాను ఖమ్మం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నట్టు తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను దృష్టిలో ఉంచుకొని రాహుల్ గాంధీ జోడో యాత్ర చేశారన్నారు.
ఇలాంటి సమయంలో మీరందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపే సమయం ఆసన్నమైందన్నారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, సోనియాగాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ కార్డుతో పాటు సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ముందు ఉంటానన్నారు. తాను ఏ ప్రభుత్వంలో ఉన్నా ఖమ్మం అభివృద్ధి కోసం పాటుపడతానన్నారు. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లను బెదిరించి బినామీ కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి కోట్లు దండుకున్న వారికి తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందమన్నారు. భూకబ్జాలు, దౌర్జన్యాలు కాలం చెల్లిందని న్నారు. శనివారం ఖమ్మం నగరంలో ప్రియాంక గాంధీ రోడ్ షో ఉందని ,ఈ రోడ్ షో కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలన్నారు. ఈ రోడ్ షో లో కార్పొరేటర్ పాకలపాటి విజయనిర్మల, నాయకులు శేషగిరి, గౌస్,సమద్, జాన్ బి,పద్మ, రవి తదితరులు పాల్గొన్నారు..
ముస్లింలను కలిసి మద్దతు కోరిన తుమ్మల...
ఖమ్మం నగరంలోని తుమ్మల గడ్డ ప్రాంతంలో ఉన్న మసీద్ వద్ధ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ముస్లింలను మర్యాదపూర్వకంగా కలిసి తమకు మద్దతు తెలపాలని కోరారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ముస్లింలకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఖమ్మం నగరంలో రెండో షాదీ ఖానా కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. నవంబర్ 30 తేదీన జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.