- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అప్పటి వరకు ఉన్న యువకుడు అంతలోనే మిస్సయ్యాడు
దిశ,తిరుమలాయపాలెం : మతిస్థిమితం సరిగాలేక ఓ యువకుడు ఇంట్లో నుంచి కనపడకుండా వెళ్లిపోయిన సంఘటన శనివారం మండలంలో వెలుగు చూసింది.కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం మండలంలోని కాకరవాయి గ్రామానికి చెందిన కొత్తపల్లి నవీన్ తండ్రి మల్సూర్ కుటుంబంతో కొంతకాలంగా హైదరాబాద్ లో జీహెచ్చ్ఎంసీలో పని చేసుకుంటూ అప్పుడప్పుడూ సొంత గ్రామమైన కాకరవాయి వచ్చి వెళ్తుంటారు. దసరా పండుగ సందర్భంగా మల్సూర్ కుటుంబం ఇక్కడకు వచ్చారు.
నవీన్ రెండు రోజులుగా సరిగా అన్నం తినడం లేదు. దీంతో కడుపులో నొప్పి తోపాటు కాళ్లు చేతులు తిమ్మిర్లుగా ఉన్నాయని తండ్రికి చెప్పాడు. మల్సూర్ ఆకు పసర వైద్యుడి వద్దకు తీసుకెళ్లి మందు తాపించాడు. అప్పటి నుంచి నవీన్ మానసిక స్థితి సరిగ్గా ఉండడం లేదు. శుక్రవారం సాయంత్రం వరకు కాకరవాయి గ్రామంలోనే ఉన్న నవీన్ రాత్రి 8 అయినా ఇంటికి రాలేదు. దీంతో కంగారు పడ్డ కుటుంబసభ్యులు వెతకడం మొదలు పెట్టారు. అయినా ఆచూకీ తెలియక పోవడంతో వారి బంధువులకు సైతం ఫోన్లు చేశారు. బంధువుల ఇంటికి కూడా వెళ్లలేదని తెలిసింది. ఆచూకీ తెలిసినవారు సెల్: 8179660460, 8106098733 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరారు.