Minister Ponguleti : కాలువ పునరుద్ధరణ పనుల్లో వేగం పెంచాలి

by Kalyani |
Minister Ponguleti : కాలువ పునరుద్ధరణ పనుల్లో వేగం పెంచాలి
X

దిశ బ్యూరో, ఖమ్మం: పాలేరు ఎడమ కాల్వ గండి పూడిక పునరుద్ధరణ పనులలో వేగం పెంచాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం మంత్రి పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం హట్యాతండా వద్ద పాలేరు ఎడమ కాల్వ గండి ప్రదేశంలో జరుగుతున్న పునరుద్ధరణ పనుల తీరును పరిశీలించారు. పాలేరు ఎడమ కాల్వ గండి పూడిక వివరాలు, తాత్కాలికంగా చేపడుతున్న పనులు, శాశ్వత పునరుద్ధరణ పనులు, మొదలగు పనుల గురించి అధికారులతో మాట్లాడారు.

ప్రస్తుతం రైతులకు సాగునీరు అందించడానికి చేపట్టిన పనులలో వేగం పెంచాలని ఇంజనీరింగ్ అధికారులకు మంత్రి సూచించారు. గండి పూడిక పనులు 24 గంటల పాటు జరగాలని, అవసరమైన మేర అదనపు యంత్రాలు, షిఫ్టుల వారీగా కార్మికులు పని చేసేందుకు ఏర్పాట్లు చేయాలని, కాల్వ తవ్వకం, లైనింగ్ పనులు సమాంతరంగా జరగాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మంత్రి పర్యటన సందర్భంగా ఇరిగేషన్ సి ఈ విద్యాసాగర్, ఎస్ ఈ నర్సింగరావు, సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story