- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గత పాలకులకు ఇంకా బుద్ధి రాలేదు
దిశ,మణుగూరు : గత ప్రభుత్వ అరాచకాలు చూసే ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని, అయినా మారకపోతే ఎలా అని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం దిశతో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. మండలాల్లో దందాలు, కబ్జాలు ఎవరిని అడ్డం పెట్టి చేపించారో ప్రజలకు తెలుసన్నారు. ప్రభుత్వ భూములను లక్షల రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకుందెవరో తెలుసన్నారు. దళితబంధు పేరుతో దోచుకోలేదా అన్నారు. పథకాల పేరుతో, ఇసుక ర్యాంపుల పేరుతో లక్షల రూపాయలు దోచుకోలేదా అని ప్రశ్నించారు. మణుగూరు ప్రాంతంలో అర్ధరాత్రులు గంజాయి సప్లై చేస్తూ యువతను పక్కదారి పట్టించిందెవరో తెలుసన్నారు.
ఇప్పటికైనా గత పాలకుడు పద్దతిగా బతకాలని సూచించారు. పదవి పోయేసరికి కొందరు తనపై బురద చల్లాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఓ గ్రూప్ ను నడిపిస్తూ తనపై లేనిపోని కారుకూతలు కూయిస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో నియోకజవర్గ ప్రజలు భయపడుతూ బతికేవారని పేర్కొన్నారు. కానీ నేడు ఇందిరమ్మ రాజ్యంలో నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలో కుల రాజకీయం చేస్తే సహించేది లేదన్నారు. గత పాలకులు ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు మంచి చేయాలి లేదా ఇందిరమ్మ ప్రభుత్వానికి తగు సూచనలు ఇవ్వాలి కానీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తే మాత్రం ఊసలు లెక్కపెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.