హైకోర్టు తీర్పును అమలు చేయాలి

by Sridhar Babu |
హైకోర్టు తీర్పును అమలు చేయాలి
X

దిశ, టేకులపల్లి : హైకోర్టు తీర్పు అమలు చేసి కోయగూడెం ఓసీ 2 భూ నిర్వాసితులకు భూమికి బదులు భూమి, నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, భూ నిర్వాసితుల యూనియన్​ ఆధ్వర్యంలో నిర్వాసితులు కోయగూడెం ఓసీలో భారీ ర్యాలీ నిర్వహించి, కేఓసీ ప్రాజెక్టు అధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం పీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైకోర్టు తీర్పు అమలు చేసి కోయగూడెం ఓసీ 2 ఫిట్ 1,2,3 లలో సాగు భూములు కోల్పోయిన గిరిజన నిర్వాసితులకు నష్టపరిహారం, సాగు భూమి, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయకుండా జరిపిన భూసేకరణతో వందలాది మంది గిరిజనులు నష్టపోయారని అన్నారు. గత పదహారు సంవత్సరాలుగా చేస్తున్న న్యాయ పోరాటంలో కిష్టారం, లచ్చగూడెం, కోయగూడెం, దంతెలతండా, కొత్తతండా, జేత్యతండా గిరిజన నిర్వాసితులే గెలిచారని, వెంటనే నష్టపరిహారం, పునరావాసం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రెవెన్యూ, సింగరేణి అధికారులు సమస్య పరిష్కారం చేయకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఈసం నరసింహారావు, కడుదుల వీరన్న, పూనెం స్వామి, పూనెం చంద్రశేఖర్, దొడ్డ కోటేశ్వరరావు, సమ్మయ్య, చుక్కమ్మ, బోడ క్రిష్ణ, బానోత్ రామా, కోరం సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed