- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇందిరమ్మ రాజ్యం లక్ష్యసాధన దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది
దిశ, ఖమ్మం రూరల్ : ఎన్నికలకు ముందు ఇందిరమ్మ రాజ్యం కోసం ప్రజలు ఆశించారని ఆ దిశగానే ప్రభుత్వం పనిచేస్తుందని, ఎన్నికల్లో రూరల్ మండలం తెల్దారుపల్లి నుంచి అత్యధిక మోజార్టీ ఇవ్వడం సంతోషకరమని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం రూరల్ మండలం తెల్దారుపల్లిలో తమ్మినేని క్రిష్ణయ్యకు నివాళ్లుర్పించి గ్రామంలో నిర్మించిన కాంగ్రెస్ దిమ్మెను మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆరు గ్యారంటీల్లో మరో రెండు పథకాలను మరికొద్ది రోజుల్లో అమలు చేస్తామని తెలిపారు. గ్రామంలో ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత తనదే అన్నారు. రాబోవు రెండు నెలల్లో కూడా పార్లమెంట్ అభ్యర్థిని అత్యధిక మోజార్టీతో గెలిపించుకుని రాహుల్‌గాంధీని ప్రధాని చేయాల్సిన ఆవశ్యకత మనపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ నాయకులు రాయల నాగేశ్వరర్రావు, రాంరెడ్డి చరణ్‌రెడ్డి, తమ్మినేని నవీన్, కళ్లెం వెంకటరెడ్డి, మద్ది మల్లారెడ్డి, బండి జగదీష్, జొన్నలగడ్డ రవి, తేజావత్ పంతులు, వినోద్, సాయి, సురేష్, రామయ్య, కేతినేని వేణు తదితరులు ఉన్నారు.
Read More..