ఉగాది నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

by Sridhar Babu |
ఉగాది నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
X

దిశ, ఖమ్మం : ఉగాది నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధితోని నర్తకి థియేటర్ రోడ్డులోని డివిజన్ 32, 36 లో రైల్వే నిధులు రూ.3 కోట్ల 3 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు, కాలువలు, పైప్ లైన్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పైప్ లైన్ నిర్మాణ పనుల్లో నాణ్యమైన సామాగ్రి వినియోగించాలని అన్నారు.

డ్రైయిన్ లైన్ నేరుగా ఉండాలని, సీసీ రోడ్లు పది కాలాల పాటు ఉండాలని ఆదేశించారు. పోల్ షిప్టింగ్, లైటింగ్ పూర్తయిన తరువాత సీసీ రోడ్లు, డ్రైయిన్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. పనులను 3 నెలల్లో పూర్తి చేయడమే లక్ష్యంగా కాంట్రాక్టర్ కు పనులు అప్పగించాలని, ఉగాది నాటికి వచ్చి చూస్తే పనులు పూర్తయి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఖమ్మం ఆర్డీఓ నర్సింహారావు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story