దిశ ఎఫెక్ట్.. దటీజ్ కలెక్టర్ గౌతమ్..

by Sumithra |
దిశ ఎఫెక్ట్.. దటీజ్ కలెక్టర్ గౌతమ్..
X

దిశ, వైరా : తన దృష్టికి సమస్య వస్తే చాలు.. వెంటనే స్పందించడమే కాదు ఆ సమస్యను ఆగ మేఘాల మీద పరిష్కరిస్తారు మన ఖమ్మం జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్. ఇప్పటికే దిశలో వచ్చిన వాస్తవిక కథనాలకు అనేకసార్లు కలెక్టర్ విపి.గౌతమ్ ప్రజా సమస్యల పై నిమిషాల వ్యవధిలో స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వైరాలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం మీసేవ కౌంటర్లు ఏర్పాటు చేయకపోవటాన్ని బహిర్గతం చేస్తూ దిశ వెబ్సైట్లో సోమవారం సాయంత్రం 3.50 నిమిషాలకు " కలెక్టర్ ఆదేశాలు బేకాతర్ " అనే వార్త కథనం ప్రచురితమైంది. ఈ కథనం ప్రచురితమైన పది నిమిషాల్లోపు కలెక్టర్ విపి.గౌతమ్ జెడ్ స్పీడ్ లో స్పందించారు. వెంటనే వైరా తహసీల్దార్ కార్యాలయ అధికారులకు ఫోన్ చేసి తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ సామాజిక వర్గంలోని కులవృత్తుల వారికి ప్రభుత్వం అందించే లక్ష రూపాయల పథకం కోసం తహసీల్దార్ కార్యాలయంలో ఎందుకు మీసేవ కౌంటర్లు ఏర్పాటు చేయలేదని కలెక్టర్ అధికారులు పై మండిపడ్డారు.

వెంటనే మీసేవ కౌంటర్లను ఏర్పాటు చేయాలని లేకుంటే తగు చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కలెక్టర్ ఆగ్రహంతో భయాందోళనకు గురైన వైరా తహసీల్దార్ కార్యాలయ అధికారులు ఆగ మేఘాల మీద తహసీల్దార్ కార్యాలయం ఆధ్వర్యంలో ఒక కౌంటర్, వైరాలోని రింగ్ రోడ్ మీసేవ కేంద్రం ఆధ్వర్యంలో మరో కౌంటర్ ను కార్యాలయంలో సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఏర్పాటు చేశారు. దిశ కథనంతో వెంటనే స్పందించి కలెక్టర్ మీ సేవ కౌంటర్ ఏర్పాటు చేయటం పట్ల ధ్రువీకరణ పత్రాల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. తాము మీసేవ కేంద్రాల చుట్టూ తిరగకుండా ఒకే చోట ధ్రువీకరణ పత్రాల మంజూరుతో పాటు బీసీ కులాల ఆర్థిక సహాయం పథకంకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించిన కలెక్టర్ కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story