- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేంద్ర ప్రభుత్వం కార్మికులపై భారం మోపుతుంది.. వైరా ఎమ్మెల్యే
దిశ, వైరా : కార్మికులపై భారం మోపేలా కేంద్రం వ్యవహరిస్తోందని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. వైరాలో మిషన్ భగీరథ కార్మిక విభాగం బీఆర్టీయూ మున్సిపాలిటీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మేడే వేడుకల్లో ఎమ్మెల్యే రాములు నాయక్ పాల్గొని మేడే జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబించడమే మోడీ విధానమని విమర్శించారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ఆదాయం పెంచి.. పేదలకు పంచాలన్న ఆలోచనతో పనిచేస్తున్నారన్నారు. కేసీఆర్ పెరిగిన ఆదాయాన్ని ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల రూపంలో ఖర్చు చేస్తుంటే.. కేంద్రం మాత్రం పేదల పొట్ట కొడుతుందని ధ్వజమెత్తారు. ప్రైవేటీకరణతో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు బడుగు, బలహీన వర్గాలకు అందకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మోడీ ప్రభుత్వం నల్ల చట్టాలను తీసుకువచ్చి కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతూ కార్మికుల హక్కులను కాలురాస్తుందన్నారు. మతతత్వ బీజేపీని ఓడించి గద్దె దింపాలని కార్మిక హక్కులు కాపాడుకోవాలని ప్రతి ఒక్క కార్మికుడు సైనికుల్లా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మిషన్ భగీరథ కార్మిక విభాగం అధ్యక్షులు మద్దెల రవి, దిశా కమిటీ సభ్యులు కట్టా కృష్ణార్జునరావు, జడ్పీటీసీ నంబూరు కనకదుర్గ, మున్సిపల్ వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు షేక్ లాల్ అహ్మద్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు పసుపులేటి మోహన్ రావు, డాక్టర్ కాపా మురళీకృష్ణ కౌన్సిలర్ వనమా విశ్వేశ్వరరావు, డాక్టర్ దారెల్లి కోటయ్య, కోఆప్షన్ సభ్యులు షేక్ బీబా నాయకులు కర్నాటి హనుమంతరావు, మచ్చా బుజ్జి, ఏదునూరి శ్రీను, మరికంటి శివ, మిషన్ భగీరథ కార్మిక విభాగం వైరా సబ్ డివిజన్ అధ్యక్షులు రేపాకుల శ్రీనివాసరావు, లింగాల వెంకటేశ్వరరావు, వైరా మున్సిపాలిటీ సిబ్బంది తుమ్మల చిన్ని, ఓర్సు రాజు తదితరులు పాల్గొన్నారు.