- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టూడెంట్స్‌ను టెన్షన్ పెట్టిన ఆర్టీసీ బస్సు..
దిశ, వైరా: ఇంటర్ విద్యార్థులు వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డు పై దిగబడిన కారణంగా విద్యార్థుల్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ ఘటన మండలంలోని ముసలిమడుగు గ్రామంలో ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల బాలికలకు ఎదురైంది. ఒక్క నిమిషం ఆలస్యం అయినా.. పరీక్షకు హాజరు కానివ్వమని ఇంటర్ బోర్డు విధించిన నిబంధన విద్యార్థినీలను ఉక్కిరి బిక్కిరి చేసింది. వివరాల్లోకి వెళితే.. గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాలకు చెందిన 72 విద్యార్థినీలు శుక్రవారం ఉదయం పరీక్షకు వెళ్లేందుకు బయలుదేరగా.. మార్గ మధ్యలో రోడ్డు మీదకు రాగానే బస్సు గ్రావెల్ రోడ్డు పై దిగబడిపోయింది.
దీంతో విద్యార్థులందరూ కలిసి బస్సును నెట్టినా ముందుకు కదల్లేదు. ఈ సంఘటనతో విద్యార్థినీలు తీవ్ర భయాందోళన చెందారు. ఈ విషయం తెలుసుకున్న జడ్పీ కో ఆప్షన్ సభ్యులు షేక్ లాల్ మహమ్మద్, తాటిపూడి ఉప సర్పంచ్ మన్నెం సత్యానందం విద్యార్థినీలను పరీక్షా కేంద్రానికి తరలించేందుకు కృషి చేశారు. ఆటోలో నిర్ణీయత సమయానికి ఐదు నిమిషాల ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంతో విద్యార్థినీలు ఊపిరి పీల్చుకున్నారు.