- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చైనా మాంజ విక్రయిస్తే కఠిన చర్యలు.. ఏఎస్పీ
దిశ, భద్రాచలం : చైనా మాంజా వినియోగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిషేధించిందని, భద్రాచలం డివిజన్ పరిధిలో ఎవరైనా విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ సింగ్ హెచ్చరించారు. భద్రాచలం డివిజన్ పరిధిలో చైనా మాంజా విక్రయాల పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
చైనా మాంజా కారణంగా పక్షులు, ద్విచక్రవాహనాల పై వెళ్లేవారు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని, ప్రాణాలు సైతం పోయే అవకాశం కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. చైనా మాంజాను గాజు పిండి, ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేస్తారు. ఈ మాంజా అత్యంత ప్రమాదకరమైనది కాబట్టే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైనా మాంజాను నిషేధించిందని, దీనిని దృష్టిలో పెట్టుకొని భద్రాచలం డివిజన్ పరిధిలో ఎవరైనా చైనా మాంజా అమ్మితే వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసి జైలు కి పంపించి, జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించారు.