- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైద్యులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు
దిశ, కొత్తగూడెం : వైద్యులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ పై కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్ లో బుధవారం సమావేశం జరిగింది. ఎస్పీ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ విద్యా చందన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఆసుపత్రిలో రోగుల హక్కులు, వారికి అందుతున్న వైద్య సదుపాయాలు, అక్కడ పనిచేస్తున్న డాక్టర్లు ,సిబ్బంది అర్హతను ఆసుపత్రికి వచ్చే రోగులకు తెలిసేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే అర్హతకు మించి వైద్యం చేస్తున్న వారిపై క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆసుపత్రులలో పనిచేసే వైద్యులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లో క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించేందుకు దగ్గరలో ఉన్న ఆస్పత్రులకు తరలించాలని కోరారు. తక్షణ చికిత్స అందేందుకు జియో ట్యాగింగ్ చేయాలని, ప్రమాదకరంగా ప్రదేశాలను గుర్తించాలన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భాస్కర్ నాయక్ మాట్లాడుతూ ప్రతి ఆసుపత్రిలో రక్త పరీక్ష కేంద్రాల్లో పరీక్షల ధరల పట్టికను ప్రజలకు తెలిసేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఐఎంఏ అధ్యక్షులు అరికల భాస్కర్ మాట్లాడుతూ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం అనుమతులు లేని ఆసుపత్రులను , ల్యాబ్లను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశలో క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ సభ్యులు డా. మధువరన్, డిప్యూటీ డెమో ఫైజ్ మొహియుద్దీన్, ఉమా మహేశ్వరి, వివేక్ తదితరులు పాల్గొన్నారు.