పదివేల మందితో వైరాలో ఆత్మీయ సమ్మేళనం..

by S Gopi |   ( Updated:2023-02-10 11:22:20.0  )
పదివేల మందితో వైరాలో ఆత్మీయ సమ్మేళనం..
X

దిశ, వైరా: వైరాలోని ఖమ్మం రోడ్డులో ఈనెల 15వ తేదీన నిర్వహిస్తున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైరా నియోజకవర్గ అనుచరుల ఆత్మీయ సమ్మేళనానికి భారీ స్థాయిలో ప్రజలు హాజరై జయప్రదం చేయాలని పీఎస్ఆర్ క్యాం కార్యాలయం ఇన్చార్జ్ తుంభూరు దయాకర్ రెడ్డి, మార్క్ ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా నియోజకవర్గ ఇన్చార్జ్ భానోత్ విజయభాయి పిలుపునిచ్చారు. వైరా సమీపంలోని వైష్ణవి పాలకేంద్రం సమీపంలో సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించే స్థలాన్ని గురువారం వారు పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం వైరా నియోజకవర్గ చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. జిల్లాలో ప్రజాబలం ఉన్న నాయకుడు పొంగులేటి అని కొనియాడారు. ఈ సమ్మేళనానికి వైరా నియోజకవర్గ నుంచి పదివేలకు పైగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరవుతారని వివరించారు. ఈ సమ్మేళన కార్యక్రమం అనంతరం నాయకులు, కార్యకర్తలకు భోజన సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు. అనంతరం సభా వేదిక ఏర్పాటుతోపాటు పార్కింగ్, ఇతర అంశాల గురించి వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, రైతుబంధు మండల కన్వీనర్ మిట్టపల్లి నాగి, వైరా మండల నాయకులు చింతనిపు సుధాకర్, పోలా శ్రీనివాసరావు, జాలాది రామకృష్ణ, దార్ల శేఖర్, సంగెపు వెంకన్న, మోదుగు లక్ష్మయ్య, కారుకొండ నరేష్, ఏదునూరి వెంకన్న, పీఆర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story