పొంగులేటి గూటికి ములకలపల్లి ఎంపీపీ..?

by Sumithra |
పొంగులేటి గూటికి ములకలపల్లి ఎంపీపీ..?
X

దిశ, ములకలపల్లి : బీఆర్ఎస్ పార్టీలో కొంతకాలంగా అసంతృప్తి చాపకింద నీరులా వ్యాపిస్తుంది. ఒకపక్క మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో ఆత్మీయ సమ్మేళనలు ఏర్పాటు చేసి తన వాళ్ళెవరో తేల్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కొందరు పొంగులేటి వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు గోడమీద పిల్లిలా వ్యవహరిస్తున్నారు.

ఎంపీపీ, రైకాస అధ్యక్షుడు పొంగులేటి గూటికి వెళ్లినట్లే..?

ములకలపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీకి కొంత బలం తక్కువే అనిచెప్పాలి. ఈ క్రమంలో ఇటీవల అన్ని మండల కేంద్రాల్లో పొంగులేటి క్యాంపు కార్యాలయాల ప్రారంభోత్సవం జరిగింది. ఇందులో బీఆర్ఎస్ పార్టీ ఎంపీపీ మట్ల నాగమణి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నాగళ్ల వెంకటేశ్వరావులు పాల్గొన్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంపీపీ, రైకాస అధ్యక్షుడు ఇద్దరిదీ ఒకే గ్రామం కావడం విశేషం.

ఎమ్మెల్యే మీద అసంతృప్తా...? పొంగులేటి మీద అభిమానమా..?

మండల అభివృద్ధిలో స్థానిక ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు ఎంపీపీతో సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవరిస్తుండటం మూలంగానే ఎంపీపీ తీవ్రఅసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అసంతృప్తితోనే ఆమె అధికార బీఆర్ఎస్ పార్టీని వీడినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే క్రమంలో పొంగులేటిపై ఎనలేని అభిమానం ఉందని, ఇలాంటి సందర్భంలో పొంగులేటికి అండగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story