భద్రాద్రిలో సెకండ్ వార్నింగ్

by Sridhar Babu |
భద్రాద్రిలో సెకండ్ వార్నింగ్
X

దిశ, భద్రాచలం : భద్రాచలంలో గోదావరి 48 అడుగులకు చేరుకోవడంతో కలెక్టర్ సెకండ్ వార్నింగ్ జారీ చేశారు. మంగళవారం ఉదయం 7.32 గంటలకు గోదావరి 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక ప్రకటించగా సాయంత్రం 5 గంటలకు 48. 2 అడుగులకు పెరగడంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ నుండి పెద్ద ఎత్తున వరద నీరు గోదావరిలోకి వచ్చి చేరడంతో గోదావరి ఇంకా పెరిగే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ఇలా ఉండగా భద్రాచలం ఏజెన్సీ లోని పలు ప్రాంతాలలో రహదారి పైకి గోదావరి ప్రవహించడంతో రవాణాకు అంతరాయం ఏర్పడింది.

Advertisement

Next Story