- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sanitation workers : వైరాలో పడకేసిన పారిశుధ్యం..
దిశ, వైరా : వైరా మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం పడక వేసి ప్రధాన రహదారుల పై మురుగు నీరు ప్రవహించినా అధికారులు స్పందించడం లేదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు అన్నారు. సోమవారం వైరా సీపీఎం కార్యాలయంలో జరిగిన సుందరయ్య నగర్ శాఖ సభ్యులు సమావేశంలో బొంతు రాంబాబు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు ఆరు నెలల అయిన వేతనాలు రాక ఉత్సాహంగా పనిచేయడం లేదని, పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించే ఏడు, ఎనిమిది వేల రూపాయలు కూడా నెలనెలా ఇవ్వకపోతే కార్మికులు కుటుంబాల జీవన పరిస్థితి దయనీయం అన్నారు. మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు ఎందరు ఆ పనిలో ఉండే సంఖ్య ఎంత కూడా స్పష్టత లేదని అన్నారు. వైరాలో ముఖ్య ప్రభుత్వ కార్యాలయాల ఎదురుగా ఖమ్మం - రాజమండ్రి జాతీయ రహదారిపై మురుగు నీరు ప్రవహించిన అధికారులు స్పందించడం లేదని అన్నారు. అదే రహదారిపై రాష్ట్ర మంత్రులు ప్రయాణం చేస్తున్నారని అన్నారు.
ఖాళీ స్థలాల్లో చెట్లు తొలిగించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్రైనేజీ కాలువల్లో ప్లాస్టిక్ కవర్లు, చెత్త అడ్డుపడి వర్షం నీరు ఇండ్లలోకి వస్తుందని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన చేతి గ్లౌసులు, బూట్లు, డ్రస్, ఇతర మెటీరియల్ అందించి పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేసి పారిశుద్ధ్యం పై కమిషనర్, చైర్మన్ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఎం వైరా పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు బొంతు సమత, పట్టణ కమిటీ సభ్యులు గుడిమెట్ల మోహన్ రావు, శాఖా కార్యదర్శులు మందడపు రామారావు, తోట కృష్ణవేణి, పారుపల్లి చంద్రశేఖర్ బాబు, కురుగుంట్ల శ్రీనివాసరావు, మల్లెంపాటి ప్రసాదరావు, రుద్రాక్షుల నరిసింహాచారి, వడ్లమూడి మధు, సామినేని నరశింహరావు, కంసాని మల్లికాంబ, వేదగిరి కళావతి, మాదినేని రజినీ, ముగ్గు సందీప్ తదితరులు పాల్గొన్నారు.